గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం కోసం అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యత లభించడంతో.. సాధారణ ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అవుతుందనే అంశం మరింత ఆసక్తిరేపుతోంది.

ఈ క్రమంలో తొలి రౌండ్ కౌంటింగ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్, హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలా నగర్, చర్లపల్లి, కాప్రా, మీర్పేట్, శేరిలింగంపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఇందులో పటాన్ చెరు డివిజన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. మిగతా స్థానాల కౌంటింగ్ కొనసాగుతోంది.