మరింత పరిశుభ్రంగా, సర్వాంగ సుందరంగ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నరు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నగర పారిశుద్ధ్య పనుల కోసం కొన్న రెండు స్వీపింగ్ మిషన్లను, కంప ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జెండా ఊపి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించిన్రు. రూ. 38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో వరంగంల్ సిటీ కోసం మొత్తం 193 పారిశుద్ధ్య వాహనాలను కొంటామన్న మంత్రి ఎర్రబెల్లి, ప్రస్తుతం 75 వాహనాలు వచ్చియన్నరు. మిగతావి కూడా తొందర్లోనే వస్తయన్నరు.

త్వరలోనే వరంగల్ నగరాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నరు. మురుగునీరు, వర్షపు నీరు నిలువ లేకుండా పడక్బందీగా పారిశుద్ధ్య పనులు జరిగేట్లు చేస్తున్నామన్నరు. సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లు, ఇతర వ్యవస్థలను బాగు చేస్తున్నామన్నరు మంత్రి ఎర్రబెల్లి.