21.7 C
Hyderabad
Friday, January 22, 2021

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు  బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఎంతమంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్న అబద్ధాలకు.. లెక్కనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ కింద ఒక్కరైనా లబ్ధి పొందిందా అని ప్రశ్నించారు.

విదేశాల్లోని నల్లధనం బయటకు తీసుకొస్తామని ఊదరగొట్టి.. నోట్లు రద్దు చేసి.. ఆ తర్వాత సడీ చప్పుడు చేయకుండా విదేశీ యాత్రలు చేశారని ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు  బీజేపీ ప్రయత్నిస్తోందని.. గల్లీ ఎన్నికల కోసం.. ఢిల్లీ నాయకులు దిగి రావడం చూస్తుంటేనే.. వాళ్ల  బుద్ధి ఏంటో తెలిసిపోయిందని ఆయన విమర్శించారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...