20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

అట్టహాసంగా 88వ వైమానిక దళ ఆవిర్భావ దినోత్సవం

భారత వైమానిక దళం 88వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వాతంత్యం వచ్చినప్పటినుంచి నేటివరకు వాయుసేన భారత ప్రజలకు విశేషసేవలందించింది. ఆధునాతన విమానాలతో శత్రు దేశాల దాడులను తిప్పికొట్టడంలో ముందున్నది భారత వాయుసేన. ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాయుసేన విజయాలను, దేశానికి వైమానిక దళం చేసిన కృషిని రాష్ట్రపతి, ప్రధాని లు గుర్తుచేసుకున్నారు.

భారత వైమానిక దళాన్ని 1932 అక్టోబరు 08 న తొలుతగా ఏర్పాటుచేసారు . రెండో ప్రపంచ యుద్ధకాలములో ఈ దళము అందించన సేవలకు గుర్తింపుగా 1945 లో రాయల్ అన్న పదాన్ని ముందు కలిపారు . 1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాయల్ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ యూనియన్‌ ఆఫ్ ఇండియాకు సేవలందించినది . 1950 లో భారతదేశము రిపబ్లిక్ గా మారాక రాయల్ పేరును తొలగించి, భారత వైమానిక దళంగా మార్చారు. ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ 1,70,000 మంది సిబ్బందితో , 1500 విమానాలతో ప్రపంచంలోనే నాల్గవ పెద్ద దళం గా ఉన్నది . మొదటి స్థానము లొ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ , రెండవ స్థానములో రష్యన్‌ ఎయిర్ ఫోర్స్ , మూడవ స్థానములో చైనా ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. 1933లో వాయుసేనలో మొదటి యుద్ధవిమానం చేరింది. ప్రప్రధమంగా భారత వాయుసేన వజిరిస్థాన్‌ ‌పోరుతో ప్రారంభమై 2వ ప్రపంచయుద్ధంలో బర్మాను జపాన్‌ ఆ‌క్రమించకుండా అడ్డుకొని తన సత్తా చాటడం జరిగింది. దేశ సరిహద్దు గగనసీమలో గస్తీ తిరుగుతూ, ప్రకృతి వైపరీత్యాలలో పౌరుల్ని మరియు ఆస్తులను కాపాడే బాధ్యతలను సమర్థవంతంగా చేపబడుతున్నది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత వాయుసేన క్రీయాశీలక పాత్రను పోషించింది. తొలి వైమానిక దళ దాడి అర్కన్ ప్రాంతంలోని జపనీస్ సైనిక స్థావరంపై జరిపింది.  ఈ యుద్ధం తర్వాత ఐఎఎఫ్‌ అంచలంచెలుగా వృద్ధి చెందింది. యూఎస్‌ కు చెందిన వుల్టీ వెంగీయన్స్, బ్రిటీష్ హాకర్ హరీకేన్, వెస్ట్‌లాండ్ లైసండర్‌ వంటి అధునాతన ఎయిర్ క్రాఫ్ట్‌లు ఐఎఎఫ్‌లో వచ్చి చేరాయి. అంతేకాకుండా.. భరతగడ్డపై పొరుగు దేశాలు దాడికి తెగబడినపుడల్లా భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 1960 ఏర్పడిన కాంగో సంక్షోభ సమయంలోను, 1962లో ఇండో-చైనా పోరులోను, కశ్మీర్‌ కోసం 1965లో పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో, 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలోను, 1984లో ఆపరేషన్ మేఘదూత్‌ లోను, 1988లో ఆపరేషన్ కాక్టస్ లోను, 1999లో కార్గిల్ వార్ సమయాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ సేవలు ప్రశంసనీయం.

వాయుసేనకు శక్తి నిచ్చిన ఆయుధ సంపత్తిలో మిగ్‌ ‌విమాన శ్రేణి, సుఖోయ్‌, ‌హెచ్‌ఏయల్‌ ‌తేజాస్‌, ‌జాగ్వార్‌, ‌బోయింగ్‌ 707, ‌హెలికాప్టర్స్, ‌మెసైల్స్ ‌లాంటివి అనేకం ఉన్నాయి. ఇవే కాకుండా ఇటీవల 36 రాఫెల్‌ ‌యుద్ధవిమానాలు చేరడం వాయుసేన శక్తిని రెట్టింపు చేసింది. దేశ స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌తో నాలుగు మరియు చైనాతో ఒక యుద్ధంలో వైమానికదళం చురుకైన భూమికను నిర్వహించింది. భారత రాష్ట్రపతి సుప్రీం కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దేశ వాయుసేన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నది. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌ప్రధాన అధికారిగా ఛీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌స్టాఫ్‌ ‌నాయకత్వం వహిస్తాడు. మన వాయుసేన 47 వింగ్స్ ‌మరియు 19 ఫార్వర్డ్ ‌బేస్‌ ‌సపోర్ట్ ‌యూనిట్లతో సుసంపన్నం అయ్యింది. వాయుసేనలోని ఏడు కమాండ్లలో సెంట్రల్‌ ఎయిర్‌ ‌కమాండ్‌-అలహాబాద్‌, ఈస్టర్న్ ఎయిర్‌-‌షిల్లాంగ్‌, ‌సదరన్‌ ఎయిర్‌-‌తిరువనంతపురం, సౌత్‌ ‌వెస్టర్న్-‌గాంధీనగర్‌, ‌వెస్టర్న్-‌న్యూఢిల్లీ, ట్రేనింగ్‌-‌బెంగళూరు మరియు మెయిన్‌టెనెన్స్ ‌కమాండ్‌-‌నాగపూర్‌లలో స్థానీకృతం అయి ఉన్నాయి. హైదరాబాద్‌?‌లోని ఎయిర్‌ ‌ఫోర్స్ అకాడమీ ద్వారా ప్రాధమిక వైమానికదళ శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రస్తుతం భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ ‌లాంటి దేశాల ఎత్తుగడలను చిత్తు చేయడంలో భారత త్రివిధదళాలు, ముఖ్యంగా వాయుసేన మనకు రక్షణ కవచంగా మారి రక్షిస్తున్నది. నేడు ఏ రెండు దేశాల మధ్యలోనైనా యుద్ధాలే జరిగితే వాయు దాడులే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు.

వాయుసేనలో అస్పీ ఇంజనీర్, కేకె.ముజుందర్, నరేంద్ర, దల్జీత్ సింగ్, హెన్రీ రంగనాథన్, ఆర్‌హెచ్‌డి సింగ్, బాబా మెహర్ సింగ్, ఎస్ఎన్.గోయల్, ప్రిత్‌పాల్ సింగ్, అర్జున్ సింగ్‌లు అగ్రగణ్యులు. వీరు వాయుసేనకు అందించిన సేవలు ప్రశంసనీయం. అసాధారణ వీరత్వానికి ప్రతీకలైన భారతదేశ త్రివిధదళాలు తమ అపార శక్తియుక్తులతో దేశ భద్రతను కంటికి రెప్పలా కాపాడుతాయనే విశ్వాసాన్ని కలిగి ఉందాం. త్రివిధదళాలను అభినందిద్దాం. జై జవాన్‌, ‌జైకిసాన్‌, ‌జై హింద్‌? అం‌టూ మనసార నినదిద్దాం.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...