25.3 C
Hyderabad
Wednesday, June 3, 2020

ఆర్థిక ప్యాకేజీ 3.0

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, వన సంపద, పశుసంపద, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 11 అంశాలుండగా, అందులో 8 అంశాలు వ్యవసాయ రంగానికి , ఇతర రంగాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, రవాణా వంటివి ఉన్నాయి. బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపు.. పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం లక్షా కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా చెప్పారు. గడిచిన రెండు నెలల్లో ఫసల్‌ బీమా యోజన కింద రూ.64 వేల కోట్లు పరిహారం ఇచ్చామన్నారు. రైతులనుంచి 74 వేల 300 కోట్ల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు రూ.20 వేల కోట్లను ప్యాకేజీ 3ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆక్వాకల్చర్​ కోసం రూ.11 వేల కోట్లు కేటాయించగా, మౌలిక వసతుల కోసం రూ.9 వేల కోట్లు కేటాయింయిపులు చేసినట్లు ఆమె వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకుసాగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల 55 లక్షల మందికి ఉపాధి పొందుతారని చెప్పారు. ఎగుమతుల విలువ లక్ష కోట్లకు రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

పశుసంపదను వెంటాడుతున్న వ్యాధులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పశువులు వంద శాతం వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. దేశంలో 53 కోట్ల వరకు పాడి పశువులు ఉన్నట్లు అంచనా ఉండగా.. ఇప్పటికే దేశంలో కోటి వరకు ఆవులు, గేదెలకు ట్యాగింగ్ పూర్తి చేశామని చెప్పారు. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీనీకోసం రూ.13,343 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.15 వేల కోట్లు కేటాయించామన్నారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామన్నారు.

ఔషధ పంటలను ప్రోత్సహించనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఔషధ పంటల అభివృద్ధి కోసం నాలుగు వేల కోట్లను కేటాయించారు. తేనే టీగల సంరక్షణకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. నేషనల్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డు ఆధ్వర్యంలో 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ పంటలు పండించేలా ప్రోత్సాహిస్తామన్నారు. రానున్న అయిదేళ్లలో ఆ విస్తీర్ణాన్ని పది లక్షల హెక్టార్లకు పెంచాలనేది తమ లక్ష్యమన్నారు. ఈ చర్యలతో రైతులకు రూ. ఐదు వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని  ఆర్థిక మంత్రి చెప్పారు.

లాక్‌డౌన్‌ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఆపరేషన్‌ గ్రీన్‌ తీసుకోస్తామన్నారు. రవాణ ఖర్చుల్లో 50%, శీతల గోదాముల రుసుముల్లో 50% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశంలోనే పసుపు పంట అత్యధికంగా తెలంగాణలో ఉత్పత్తి అవుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు.

- Advertisement -

Latest news

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

Related news

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట,...

విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

విద్యుత్ చట్ట -2003 కు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో.....

తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా

తమిళనాడులో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1162 కరోనా కేసుల నమోదు కావడంతో బాధితుల సంఖ్య  23,495కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డంతో...

అసోంలో కొండ చరియలు విరిగి 20మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాలతో దక్షిణ అసోంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో 20 మంది మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న...