18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

ఇండియాకు నేడే రాఫెల్ రాక

భారత రక్షణ వ్యవస్త మరింత బలోపేతం కానుంది. భారత వాయుసేన అమ్ములపొదిలో చేరేందుకు మరికొద్ది గంటల్లో రాఫెల్ యద్ధవిమానాలు భారత్ కు చేరుకోనున్నాయి. దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావాణ కాష్టం రగిలిస్తున్న పాకిస్తాన్ కు, ఇటీవల తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు ఏక కాలంలో బుద్ది చెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్ ఫైటర్ జెట్ లతో భారత్ సంతరించుకోనుంది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్దవిమానాల్లో ఐదు ఇవాళ హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్ కు చేరుకోనున్నాయి. చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్  వాయుసేనకు చేరిన జేఎఫ్-17తో పోలిస్తే..రాఫెల్ యుద్ధ విమానం పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు.                              

తొలి దశలో భాగంగా భారత్‌కు ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌ లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరి మధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ కు  చెందిన అల్‌-దాఫ్రా వైమానిక స్థావరం వద్ద ఆగాయి. అక్కడ ఎయిర్ ఫ్యూయల్  చేయించుకున్నాయి. దాదాపు 7 వేల 364 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఇవాళ హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన అధునాతన సాంకేతికతను వీటికి అమర్చడంతో భారత రాఫేల్ మరింత శక్తివంతంగా రూపొందింది. అటు 30 వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రాఫెల్ యుద్ధ విమానాల ఫోటోలను భారత వాయుసేన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.                                                                  

రాఫెల్ యుద్ధ విమానాలు హ‌ర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు రానుండటంతో.. అక్క‌డ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. అంబాలా కంటోన్‌ మెంట్ ప‌రిధిలోని నాలుగు గ్రామాల్లో 144 సెక్ష‌న్ విధించారు. రాఫెల్ యుద్ధ విమానాల‌ ల్యాండింగ్ సమయంలో  ఇంటి మిద్దెలు, డాబాల‌పై ప్ర‌జ‌లు గుమిగూడ‌టం, ఫోటోలు తీయ‌డంపై నిషేధం విధించారు. అలాగే అంబాలా కంటోన్‌మెంట్ ప్రాంతాన్ని డ్రోన్ ర‌హిత ప్రాంతంగా ప్ర‌క‌టించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...