23.4 C
Hyderabad
Thursday, July 16, 2020

ఇకపై స్విగ్గీలో మామిడి పండ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బిర్యాని, భోజనం, ఆహారపదార్థాలు సరఫరా చేసే స్విగ్గీ ఇకపై మామిడిపండ్లు అందించనుంది. సహజంగా మగ్గిన మామిడిపండ్లను తినాలనుకునే వారు స్విగ్గీ ఆన్‌లైన్‌ డెలివరీ సేవలను వినియోగించుకోవాలని సెర్ప్‌ సీవోవో రజిత తెలిపారు. మామిడిపండ్ల డోర్‌ డెలివరీకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) గతంలోనే స్విగ్గీతో ఒప్పందం చేసుకున్నది. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో అది అమలుకాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యంతో 14 జిల్లాల్లో ఎంపిక చేసిన రైతుల నుంచి సెర్ప్‌ మామిడికాయలను సేకరిస్తున్నది. వాటిని ‘బెనిషాన్‌’ పేరుతో విక్రయిస్తున్నది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టిన అధికారులు ఇప్పటి వరకు 500 టన్నుల మామిడిని సేకరించి,  400 టన్నుల వరకు విక్రయించారు. వాల్‌మార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, మెట్రో, 24 మంత్ర, క్రిషియోగా మార్ట్‌లలో కూడా బెనిషాన్‌ బ్రాండ్‌ మామిడి అందుబాటులో ఉందని రజిత తెలిపారు. హైదరాబాద్‌లో గేటెడ్‌ కమ్యూనిటీలు, ఫ్లాట్‌లలో ఉండేవారు 100 కిలోల వరకు ఆర్డర్‌ ఇస్తే సెర్ప్‌ ద్వారా నేరుగా పండ్లను ఇంటికి సరఫరా చేస్తామన్నారు. కావాల్సినవారు 6301295843 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...