21.4 C
Hyderabad
Friday, October 23, 2020

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని రకాల చర్యలు తీసుకుందని వివరించారు. వృద్ధి రేటుతో పాటు ఆర్థిక స్థిరత్వంపై ఆర్‌బీఐ దృష్టి సారించిందన్నారు.  భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత, తిరిగి కోలుకోగలిగే శక్తికి కరోనా సంక్షోభం పరీక్షగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు ఆర్‌బీఐ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వడ్డీ రేట్లను 250 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు గుర్తుచేశారు.  దేశంలో ఉపాధి, ఇతర రంగాలపై కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపిందని వెల్లడించారు. 

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...