దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్ చేసుకుని వచ్చినవారినే అనుమతిస్తుండటం, వారు కూడా చాలామంది ప్రయాణించకపోవడంతో రద్దీ కనిపించడం లేదు. రైల్వే చార్ట్ ప్రకారం పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో భారీగా రిజర్వేషన్లు చేసుకుంటున్నా.. ప్రయాణించే వారు తక్కువగా ఉంటున్నారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలోనూ పరిస్థితి ఇలాగే ఉన్నట్లు అధికారులు తెలిపారు.