24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

కోవాక్సిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభం

ఫార్మా దిగ్గజం.. భారత్ బయోటెక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ లో కోవ్యాక్సిన్ ఉత్తమ ఫలితాలు వచ్చాయి. దీంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతులు ఇచ్చింది. తొలి రెండు దశల్లో వెయ్యి మందిపై ఈ ట్రయల్స్ జరపగా… ఇప్పుడు ఏకంగా 26వేల మందిపై ఫేజ్ త్రీ ట్రయల్స్ ను నిర్వహించనున్నారు. తొలి దశలో వ్యాక్సిన్ సేఫ్టీ, రెండో దశలో ఇమ్యునోజెనిసిటీకి సంబంధించిన విషయాలను పరీక్షించారు. ఇక మూడో దశలో వ్యాక్సిన్ పూర్తి సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 25కేంద్రాల్లో… ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో కలిసి భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలను చేస్తోంది. ఇప్పటికే వాలంటీర్లు స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్, న్యూఢిల్లీ, ముంబై, ఏపీ, భోపాల్ లో రెండేసిచోట్ల.. అహ్మదాబాద్, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, రోహ్ తక్, గోవా, గువాహటి, ఫరీదాబాద్, నాగ్ పూర్, పాట్నా, పాండిచ్చేరి, బెంగుళూరు, కోల్ కత్తా, చెన్నైలలో ఒక్కో ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.  తెలంగాణలో నిమ్స్, ఏపీలో గుంటూరు మెడికల్ కాలేజీ, విశాఖల కింగ్ జార్జ్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారిని రెండు గ్రూప్ లుగా విభజించి ఇంట్రా మస్క్యూలర్ ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు. మొత్తం 26వేల మందిలో 13వేలమందికి ఆరు గ్రాముల మైక్రో కోవ్యాక్సిన్ ఇంజెక్షన్లు రెండు, లేక ప్లాసిబో రెండు డోసులను ఇవ్వనున్నారు. ట్రయల్స్ లో పాల్గొన్న వారి ఆరోగ్య పరిస్థితులను, వారిపై కరోనా ప్రభావాన్ని ఏడాది పాటు పరిశీలించనున్నారు.  18ఏళ్లు పైబడిన స్త్రీ , పురుషులపై మాత్రం ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. నిర్వీర్యం చేసిన కోవిడ్ వైరస్ తో ఈ వ్యాక్సిన్ ని రూపొందించారు. ఫేజ్ త్రీ ట్రయల్స్ లో కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తే భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైనట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యాక్సిన్ ల రూపకల్పనలో భారత్ బయోటెక్ కు విశేష అనుభవం ఉంది. 140 గ్లోబల్ పేటెంట్స్,16కి పైగా వ్యాక్సిన్ లు, 4 బయో థెరప్యూటిక్స్ , WHO ప్రీ-క్వాలిఫికేషన్ కూడా ఉండటం విశేషం. భారత్ బయోటెక్ ఇప్పటికే పలు వ్యాధులకు టీకాలు అభివృద్ధి చేసింది. కోవ్యాక్సిన్ సైతం దిగ్విజయంగా రెండు ఫేజుల ట్రయల్స్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే ఫేజ్ త్రీ ట్రయల్స్ ని సైతం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటుందని సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...