27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్స్‌పై నిషేధం

సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ డిజిటల్‌ షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన యాప్‌లపై కొరడా ఝళిపించింది. చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌, వీచాట్‌, హలో, షేర్‌ఇట్‌, యూసీ బ్రౌజర్‌ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. సమాచార సాంకేతికత నిబంధనలు 2009, సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దేశ రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫాంలలోని కొన్ని యాప్స్‌ వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. విదేశాల నుంచి నడుస్తున్న కొన్ని సర్వర్లకు అనధికారికంగా ఆ సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. వినియోగదారుల సమాచార భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 53 యాప్‌లను వెంటనే నిషేధించాలని గతవారం నిఘావర్గాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.

నిషేధానికి గురైన వాటిలో టిక్‌టాక్‌, షేర్‌చాట్‌, క్వాయి, యూసీ బ్రౌజర్‌, బైయిదూ మ్యాప్‌, షెయిన్‌, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హలో, లైకీ, యూక్యామ్‌ మేకప్‌, మీ కమ్యూనిటీ, సీఎమ్‌ బ్రౌజర్స్‌, వైరస్‌ క్లీనర్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, రామ్‌వీ, క్లబ్‌ ఫ్యాక్టరీ, న్యూస్‌డాగ్‌, బ్యూటీప్లస్‌, వీచాట్‌, యూసీ న్యూస్‌, క్యూక్యూ మెయిల్‌, వీబో, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ ఫీడ్‌, బిగో లైవ్‌, సెల్ఫీసిటీ, మెయిల్‌ మాస్టర్‌, ప్యారెలాల్‌ స్పేస్‌, మీ వీడియో కాల్‌, వీ సింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, వైవా వీడియో, మెయితూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్‌ డీయూ రికార్డర్‌, వాల్ట్‌ హైడ్‌, క్యాష్‌ క్లీనర్‌, డీయూ క్లీనర్‌, డీయూ బ్రౌజర్‌, హగో ప్లే, క్యామ్‌ స్క్యానర్‌, క్లీన్‌ మాస్టర్‌ (ఛీతా మొబైల్‌), వండర్‌ కెమెరా, ఫొటో వండర్‌, క్యూక్యూ ప్లేయర్‌, వీ మీట్‌, స్వీట్‌ సెల్ఫీ, బైయిదూ ట్రాన్స్‌లేట్‌, వీమేట్‌, క్యూక్యూ  ఇంటర్నేషనల్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంఛర్‌, యూ వీడియో, వీ ఫ్లై స్టేటస్‌ వీడియో, మొబైల్‌ లెజెండ్స్‌, డీయూ ప్రైవసీ యాప్స్‌ ఉన్నాయి.

యాప్స్‌ను నిషేధించటం రెండుమూడు రకాలుగా ఉంటుంది. ప్రభుత్వమే నేరుగా బ్యాన్‌ చేయటం ఒకటి. రెండోది మొబైల్‌ యాప్స్‌ను అందించే గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి నిషేధించిన యాప్స్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరటం. ఇందుకోసం ప్రభుత్వాలు చట్టాల ద్వారా కంపెనీలకు ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. మూడోది మొబైల్‌ తయారీ కంపెనీలు, టెలికం ప్రొవైడర్లను నిషేధిత యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వరాదని ఆదేశించటం. ప్రస్తుతం ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌లో చాలావరకు థర్డ్‌పార్టీ యాప్‌లే ఉన్నాయి. మొత్తంగా ఈ యాప్స్‌ నిషేధంతో చైనా టెక్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని టెలికం నిపుణులు చెప్తున్నారు. 

- Advertisement -

Latest news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

Related news

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...