18 C
Hyderabad
Friday, November 27, 2020

దేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ కు రెండో స్థానం

హైదరాబాద్ మెట్రోరైలు అంచనాలకు మించి పురోగమిస్తు న్నది.  కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నగరవాసుల అమితాదరణను కూడగట్టుకుంటున్నది. మెట్రో రైడర్న్ లో దేశంలోనే రెండోస్థానంలో నిలిచి ‘ది బెస్ట్’ అనిపించుకుంటున్నది. దేశంలో పది మెట్రోలుండగా, ఢిల్లీ తర్వాత అత్యధికులు మన మెట్రోలోనే ప్రయాణించడం, అతి తక్కువ సమయంలోనే మెట్రో ఈ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. గత శనివారం రోజున ఢిల్లీలో 14 లక్షల మంది ప్రయాణించగా, మన దగ్గర 1.33 లక్షలు ప్రయాణించి రికార్డు సృష్టించింది. 

కరోనా తర్వాత వారాంతపు రోజుల్లో ఈ శనివారమే రికార్డు స్థాయి ప్రయాణి కులు ఎక్కారని హైదరాబాద్ మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలే దేశంలోని అన్ని మెట్రోలు కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను సైతం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి నడిపిస్తున్నాయి. అన్ని మెట్రోలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అయితే మొదట్లో ఉన్నంత ఆదరణ అంతగా ఉండదని, ప్రయాణికులు రారని అందరూ అనుకున్నారు. హెచ్ఎంఆర్, ఎల్‌&టీ వర్గాలు సైతం రద్దీ క్రమంగా పెరుగుతుందని అంచనాలు వేశాయి.        

లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ మెట్రోలో తొలుత 15వేలు, ఆ తర్వాత 35 వేల వరకు, రెండునెలల్లో లక్షకు మించకపోవచ్చన్న అంచనాలుండే. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ హైదరాబాద్ మెట్రో ధూంధాంగా దూసుకుపోతున్నది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రోజుకు లక్షా ముప్పైవేల మందిని గమ్యం చేరుస్తున్నది. దేశంలో ప్రస్తుతానికి 10 మెట్రో లుండగా, వాటిల్లో చాలా మెట్రోలు ఏండ్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వాటితో పోల్చితే హైదరా బాద్ మెట్రో చాలా తక్కువ వయస్సు గలది. అతి తక్కువ కాలంలోనే.. అదీ కరోనా పరిస్థితుల్లో రికార్డు స్థాయి ప్రయాణికులను గమ్యస్థానం చేర్చడంపై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...