23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

దేశవ్యాప్తంగా ఆర్బీఐ పరిధిలోకి 1540 సహకార బ్యాంకులు

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.  దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో సుమారు 8.6 కోట్ల ఖాతాదారులకు సంబంధించిన రూ.4.84 లక్షల కోట్ల డబ్బు ఉన్నది.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...