25.9 C
Hyderabad
Tuesday, October 27, 2020

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెట్టుబడులు పెట్టడానికి బంగారం మంచి మార్గంగా ఎక్కువ శాతం మంది భావిస్తుంటారు. అటువంటి పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం, వెండి ధరలు రికార్డు స్ధాయిలో పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరానికి స్వర్ణం చేరువవుతోంది.   

బంగారం ధరలు పెరగడంతో ముఖ్యంగా పెళ్లిళ్లకూ, శుభకార్యాలకూ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అమెరికా-చైనా ఉద్రిక్తత, కరోనా వైరస్‌ కల్లోలం, అనిశ్చత రాజకీయ పరిస్థితులు రాబోయే రోజుల్లోనూ బంగారానికి భారీ డిమాండ్‌ను పెంచుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా బంగారం ధరలు ఏకంగా 1500 రూపాయలు పెరిగాయి. పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్‌ పడేలా లేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని అంటున్నారు

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం  రెండు వేల  డాలర్లకు చేరువవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఎల్లో మెటల్‌ భారమైంది. ఎంసీఎక్స్‌లో  పదిగ్రాముల బంగారం 150 రూపాయలు పెరిగి 52,250 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలో వెండి 977 రూపాయలు పెరిగి 66 వేల 505 రూపాయలు పలికింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికా డాలర్‌ బలహీనపడటంతో పెట్టుబడి సాధనంగా బంగారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా త్వరలోనే 60 వేలపైగా చేరుకునే అవకాశం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...