18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

పెరిగిన డీజిల్‌… రూ.81.58కు చేరిన ధర

రవాణా రంగంలో అత్యధికంగా ఉపయోగించే డీజిల్‌ ధరలను.. చమురు కంపెనీలు ప్రతిరోజు పెంచుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా లీటర్‌ డీజిల్‌పై ఇవాళ 17 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 81రూపాయల 58పైసలకు చేరింది. అయితే పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెల 29 నుంచి పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. జూన్‌ 7 నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అయితే జూన్‌ 29న పెట్రోల్‌ ధరను మార్చకుండా, డీజిల్‌ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి. మళ్లీ గత నాలుగు రోజుల నుంచి వరుసగా డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...