28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. చాలా దేశాల్లో ఓవైపు ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటుండగా.. మరోవైపు కరోనా కేసులూ పెరుగుతున్నాయి. దీంతో మదుపర్లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ 687 పాయింట్లు నష్టపోయి 32 వేల 850 దగ్గర కొనసాగుతుంది.  నిఫ్టీ 209 పాయింట్లు దిగజారి 9 వేల 692 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ  75.71గా కొనసాగుతోంది. వేదాంత, సన్‌ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

Related news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...