స్టాక్ మార్కెట్ ప్రస్తుతం భారీ నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ. మంగళవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 448 పాయింట్లు కోల్పోయి 37,585 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి 11,104 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.44 వద్ద కొనసాగుతోంది.
టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా.. జీ ఎంటర్టైన్మెంట్, గెయిల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి.