లాక్డౌన్ కాలంలో రుణ గ్రహితలకు కల్పించిన మారటోరియం పరిధిని పొడగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఆర్బీఐ. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిడ్ దాఖలు చేసింది. ఆరు నెలలకు మించి ఉపశమనం కల్పించడం సాధ్యం కాదని అఫిడవిట్లో స్పష్టం చేసింది. అయితే మారటోరియం కాలంలో రెండు కోట్ల రూపాయల వరకు రుణాలపై చక్రవడ్డీని మాత్రమే మాఫీ చేశామని, మారటోరియాన్ని ఇకపై పొడగించడం కుదరదని చెప్పింది. మారటోరియం వ్యవధి ఆరు నెలలు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. చక్రవడ్డీని మాఫీ చేయడం మినహా మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్ధిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి నష్టం వాటిల్లుతుందని కేంద్రం, ఆర్బీఐలు తమ అఫిడవిట్లో పేర్కొన్నాయి.