22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

రూ. 53వేలు దాటిన బంగారం ధర

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఆల్‌ టైమ్‌ హై కి చేరుతున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల పసిడి రేటు రూ. 53వేలకు ఎగబాకింది. 22క్యారెట్ల ధర రూ. 49వేలు దాటింది. ఇదే సమయంలో కేజీ వెండి ధర రూ. 3,673 పెరిగి రూ. 64,896కు చేరింది. శ్రావణ మాసం కావడం, వివాహాది శుభకార్యాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పుత్తడి, వెండి ధరలకు రెక్కలొచ్చాయి.  ఇటు ఆసియా మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,937.50 డాలర్లకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. యూఎస్, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ వైపు చూస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతూ కలవర పెడుతున్నాయి.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...