19.8 C
Hyderabad
Friday, December 4, 2020

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.  ఉదయం 9.18 సమయంలో సెన్సెక్స్‌ 165 పాయింట్లు లాభపడి 37,828 వద్ద,  నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,154 వద్ద ట్రేడవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌, హాత్‌వే కేబుల్స్‌, ప్రిస్మ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, డిష్‌టీవీ షేర్ల విలువ పెరగ్గా.. వీఐపీ, ఓమెక్స్‌, అదానీ గ్యాస్‌, టీటీకే ప్రస్టీజ్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌లు నష్టపోయాయి. నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనుండటంతో మార్కెట్లు ఆశావాహంగా ట్రేడవుతున్నాయి.బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెర్లించ్‌ అంచనా ప్రకారం ఆర్‌బీఐ మరో 25 బేసిస్‌ పాయింట్ల మేరకు రెపోరేటును తగ్గించే అవకాశం ఉన్నది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-0.4 శాతం మధ్య లాభపడ్డాయి.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...