స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు జంప్ చేశాయి. ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ లు లాభాలతో కదులుతున్నాయి. టెక్ 5-1.3 శాతం మధ్య ఎగశాయి. డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్, సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్, పీవీఆర్, పిరమల్, కోఫోర్జ్ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి.
