మధ్యప్రదేశ్ లో ఇందన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధర రూ. 90కి చేరుకోగా.. లీటర్ డీజిల్ రూ. 81 పలుకుతోంది. వారం రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటు దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 82.34గా ఉండగా, డీజిల్ ధర రూ.72.42గా ఉంది. ముంబైలో ఈరోజు పెట్రోలు లీటరు ధర రూ. 89.02గా ఉండగా, డీజిల్ ధర రూ. 78.97గా ఉంది.