18 C
Hyderabad
Friday, November 27, 2020

సమాచార శాఖ నియంత్రణలోకి ఆన్‌లైన్ ఛానెల్స్

రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆన్‌లైన్ ఛానెల్స్ పై నిఘా పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ ఛానెల్స్, కంటెంట్ అందించే సంస్థలను సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకువస్తూ విడుదలైన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్ నాథ్ సంతకం చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ తరహా వంటి ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి.
ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్స్ లో అశ్లీలత పెరిగిపోవడంతో….వాటిపై నియంత్రణ ఉండాలని ఇప్పటికే కేంద్రానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది అత్యున్నత న్యాయస్థానం.
ఓటీటీ తరహా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఎలాంటి సెన్సార్‌ క్లియరెన్స్ లేకుండా కంటెంట్‌ను విడుదల చేస్తున్నారని పిటీషన్‌దారులు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని నియంత్రణలోకి తెచ్చేందుకు తాజా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...