17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడులు

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నాయి. ఇప్పటికే నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టిన అమెజాన్‌.. మరిన్ని ఇన్వెస్ట్‌ మెంట్లతో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో రెండు భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసింది. రాబోయే పండుగ సీజన్‌ దృష్ట్యా డిమాండ్‌కు తగ్గ నిల్వలను నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను అమెజాన్‌ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మొత్తం హైదరాబాద్‌లో అమెజాన్‌ గిడ్డంగులు నాలుగుకు చేరగా, వీటి నిల్వ సామర్థ్యం 4.5 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులకుపైనే.

నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నా.. హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఆఫీస్‌ను అమెజాన్‌ ఏర్పాటు చేసింది. అలాగే భారత్‌లో ఇక్కడి నుంచే తమ వ్యాపార కార్యకలాపాలను ప్రధానంగా నిర్వహించాలని భావిస్తున్నది. కాగా, ఇటీవలే దేశంలో 10 కొత్త గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ఏడింటిని విస్తరిస్తామని అమెజాన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇదివరకే ఉన్న గిడ్డింగి సామర్థ్యాన్ని లక్ష చదరపు అడుగులకుపైగా పెంచింది. దీనివల్ల తెలంగాణలో 23వేల వ్యాపారులకు ప్రయోజనం చేకూరినట్లైంది. హైదరాబాద్‌లో అమెజాన్‌ ఫుల్‌ ఫిల్‌ మెంట్‌ సెంటర్ల విస్తరణ.. డెలివరీ వేగాన్ని పెంచనున్నది. పొరుగు రాష్ర్టాల్లోని కస్టమర్ల ఆర్డర్లనూ ఇక త్వరగా అందించే వీలు ఏర్పడింది. రాష్ట్రంలోని ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, టెలివిజన్లు తదితర ఉత్పత్తుల నిల్వకు ప్రత్యేకం. మొత్తంగా పండుగ సీజన్‌లో అటు వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకూ లాభించనున్నది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...