20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

1.7 లక్షల ట్విటర్‌ అకౌంట్లు తొలగింపు

ఇటీవల దాదాపు లక్షా 70 వేల అకౌంట్లు తొలగించినట్లు ట్విటర్‌ ప్రకటించింది. చైనా అనుకూల వదంతులను వ్యాప్తి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19, హాంకాంగ్‌ నిరసన సహా మరిన్ని సున్నితమైన అంశాల్లో కొంతమంది అసత్య సందేశాల్ని పోస్ట్‌ చేస్తున్నారని తెలిపింది. ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా విధానాలకు మద్దతుగా ఉన్నట్లు వెల్లడించింది. ట్విటర్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ధ్రువీకరించుకున్నాకే ఈ నిర్ణయం తీసకున్నట్లు పేర్కొంది. విదేశాల్లో ఉన్న చైనీయులపై పార్టీ విధానాల్ని రుద్దడమే లక్ష్యంగా ఈ తప్పుడు సందేశాల్ని వ్యాప్తి చేస్తున్నట్లు  ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌  తెలిపినట్లు ట్విటర్‌ వెల్లడించింది. ఆ సందేశాల్లో అధిక భాగం చైనా భాషలో ఉన్నట్లు గుర్తించామంది. 

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...