18 C
Hyderabad
Friday, November 27, 2020

30శాతం పడిపోయిన పసిడి ధర

కరోనా వైరస్‌ ప్రభావం దేశీయ పసిడి మార్కెట్‌పైనా పడింది. ఈ జూలై-సెప్టెంబర్‌ లో 30 శాతం కొనుగోళ్లు పడిపోయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక విడుదల చేసింది. కరోనా పరిస్థితులకుతోడు మార్కెట్‌లో అధిక ధరలు సైతం కొనుగోలుదారులను దూరం చేశాయి. అయితే ఆగస్టులో లాక్‌డౌన్‌ సడలింపులు, కాస్త ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు కొంతమేర పెరిగాయి. అయితే ఆర్థిక మాంద్యంతో ప్రభావితమైన 2009 లోనూ బంగారం డిమాండ్‌ భారీగా పడిపోయింది.., అయినప్పటికీ తర్వాతి సంవత్సరాల్లో ఒక్కసారిగా పుంజుకున్నది. అలాగే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. 

అంతర్జాతీయంగానూ బంగారం డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నది. గ్లోబల్‌ గోల్డ్‌ డిమాండ్‌ ఈ జూలై-సెప్టెంబర్‌లో 19శాతం క్షీణించి 892.3 టన్నులుగా నమోదైంది. పెట్టుబడుల డిమాండ్‌ 21శాతం పెరుగగా, బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లకు, ఈటీఎఫ్‌లకు ఆదరణ కనిపించింది. దేశీయంగా జూలై-సెప్టెంబర్‌లో బంగారం డిమాండ్‌ 86.6 టన్నులుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 30శాతం తగ్గింది. డిమాండ్‌ విలువ ఈసారి 39 వేల 510 కోట్లుగా ఉంటే, కిందటిసారి 41 వేల 300 కోట్లుగా ఉన్నది. మొత్తం ఆభరణాల డిమాండ్‌ 48శాతం పడిపోయి 52.8 టన్నులుగా ఉన్నది. ఈ జూలై-సెప్టెంబర్‌లో 33.8 టన్నుల పసిడిపై పెట్టుబడులు పెట్టారు. గతేడాదితో పోల్చితే 52శాతం పెరిగింది. ఈ పెట్టుబడుల విలువ ఈసారి 15 వేల 410 కోట్లుగా, నిరుడు  7 వేల 450 కోట్లుగా ఉన్నది. మొత్తం 41.5 టన్నుల బంగారం శుద్ధి జరిగింది. గతేడాదితో పోల్చితే 14శాతం పెరిగింది.

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...