ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ తో ఇన్నాళ్లూ కేవలం ఫ్లిప్ కార్ట్ లోనే వాడుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై వాటిని ఆఫ్ లైన్ లోనూ వినియోగించుకునే సౌలభ్యం కల్పించింది. దేశ వ్యాప్తంగా 5వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్లైన్ రిటెయిల్ స్టోర్లలో ‘కాయిన్ పే’తో వస్తువులను కొనవచ్చు. ఫ్యాషన్, ఫుడ్, పానీయాలు, గ్రాసరీలు, హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రొడక్టులతోపాటు ట్రావెల్ సేవలను కాయిన్ పేతో పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ సంస్థ చెబుతోంది.
సూపర్ కాయిన్ పే అందుబాటులో ఉన్న స్టోర్ లో ఏవైనా వస్తువులను కొన్న తర్వాత ఫ్లిప్ కార్ట్ లో ఉండే సూపర్ కాయిన్స్ సెక్షన్ లోని ఫీచర్ సహాయంతో రిటెయిలర్ దగ్గర ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కొన్న వస్తువులకు చెల్లింపులు చేయొచ్చు.