పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 4.78 లక్షల కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఇంకా వివిధ రంగాలకు నిధుల కేటాయింపులు ఇలా ఉన్నాయి.
– వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ : రూ. 2,56,948 కోట్లు
– హోంశాఖ : రూ. 1,66,547 కోట్లు
– గ్రామీణాభివృద్ధి : రూ.1,33,690 కోట్లు
– వ్యవసాయ, రైతుల సంక్షేమం : రూ.1,31,531 కోట్లు
– రోడ్డు రవాణా, హైవేలు : రూ.1,18,101 కోట్లు
– రైల్వే : రూ.1,10,055 కోట్లు
– విద్య : రూ.93,224 కోట్లు
– ఆరోగ్య, కుటుంబ సంక్షేమం : రూ.73,932 కోట్లు
– గృహ, పట్టణ వ్యవహారాలు : రూ.54,581 కోట్లు
– కొవిడ్ వ్యాక్సినేషన్ : రూ. 35 వేల కోట్లు