రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ ప్రైమ్ మెంబర్స్‌కు 24 గంటల ముందే స్పెషల్ సేల్‌గా అందుబాటులోకి వస్తుంది. జనవరి 19వ తేదీ రాత్రి 12గంటలకు ఈ సేల్ మొదలవ్వనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐలతో అదనంగా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో.. వన్ ప్లస్ 8T 40,499 రూపాయలకే లభిస్తుంది. రెడ్మీ 9A 6,499 రూపాయలకు, అలాగే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో.. 20,999 రూపాయలకే లభించనున్నాయి.
ఫ్లిప్ కార్ట్ కూడా జనవరి 20 నుంచి 24 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. కొన్ని క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 11 .. 50,299 రూపాయలకే లభిస్తుంది. అలాగే మోటో జీ 5G 18,999రూపాయలకు లభిస్తుంది. ఇవేకాకుండా ఎలక్ట్రానిక్స్ లో 80 శాతం వరకూ ఆఫర్స్ ఉండబోతున్నాయి.