2020లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్‌గా స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మారుతి సుజుకీ ప్రకటించింది. గతేడాది 1,60,700 యూనిట్ల స్విఫ్ట్ కార్లను అమ్మినట్లు కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు. 2005లో మార్కెట్లోకి ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. స్విఫ్ట్ కస్టమర్లలో 53శాతానికి పైగా 35ఏళ్లలోపే ఉన్నారట. ఇక గతేడాది అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతికి చెందిన ఆల్టో రెండో స్థానంలో ఉంది. టాప్10లో ఉన్న మోడళ్లలో ఏడు మారుతివే కావడం విశేషం. బాలెనో, వేగనార్, డిజైర్, ఎకో, బ్రెజా టాప్ సెల్లర్ల జాబితాలో ఉండగా.. ఏడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా, ఎనిమిదిలో కియా సెల్టోస్, తొమ్మిదిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఉన్నాయి.