2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 11.5 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. భారత్ మాత్రమే కరోనా సమయంలో కూడా రెండంకెల జీడీపీని నమోదు చేయగలదని ఐఎంఎఫ్ పేర్కొంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అప్డేట్ రిపోర్టులో ఈ మేరకు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో చైనా 8.1% జీడీపీ, ప్రపంచ వృద్ధిరేటు 5.5%గా మించదన్నారు.
ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి -అవకాశాలు 2021’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులోనూ భారత వృద్ధిరేటు 2021లో 7.3 శాతం లెక్కకట్టింది. 2020 జీడీపీని లాక్డౌన్, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయని నివేదికలో ప్రస్తావించారు.