బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబర్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించనున్నారు. ఈ కారణంగా నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో మొబైల్ ఫోన్ల ధరలు, కార్ల విడిభాగాలు, సోలార్ ఇన్వర్టర్లపై పన్ను రేట్లను పెంచడంతో అవి మరింత ప్రియం కానున్నాయి.