నిన్నటి బడ్జెట్ ఎఫెక్ట్ బంగారంపై పడింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లాంటి నిర్ణయాల వల్ల బంగారం ధర తగ్గింది. ఇంకా ఫ్యూచర్ లో భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,500 ఉంది. తులం బంగారం ధర రూ.36,400 ఉంది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,640 ఉంది. తులం బంగారం ధర రూ.39,712 ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.79,200 ఉంది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.633.60 ఉంది.
