29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

30 లోన్ యాప్‌లను తొలగించిన గూగుల్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను పాటించని 30 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది.  ఆర్బీఐ రూల్స్ ప్రకారం సదరు లోన్ యాప్ లపై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ తొలగించిన వాటిలో పేయూ క్రెడిట్‌ ప్లాట్‌ఫామ్‌ లేజీ పే, క్యాష్‌ గురు, 10మినిట్స్‌ లోన్‌, రూపీ క్లిక్‌, ఫైనాన్స్‌ బుద్ధ తదితర యాప్ లు ఉన్నాయి. యూజర్లు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో  గూగుల్ స్టోర్ లోని రుణ యాప్‌ల తీరు తెన్నులను సమీక్షించినట్లు గూగుల్‌ ప్రొడక్ట్‌, ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అండ్‌ ప్రైవసీ వైస్‌ ప్రెసిడెంట్‌ సుజాన్‌ ఫ్రే చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో  యాప్ ల ద్వారా రుణాలు తీసుకున్న కొందరు బాధితులు ఆత్మహత్యలకు పాల్పడటంతో లోన్ యాప్‌ల బాగోతంపై ఆర్బీఐ, గూగుల్‌ దృష్టి సారించాయి.

- Advertisement -

Latest news

Related news