31.5 C
Hyderabad
Monday, March 1, 2021

చక్రాలు లేని రైలు ఇది

పట్టాల మీద వెళ్తే.. ట్రైన్ అంటారు. గాల్లో వెళ్తే ఫ్లైట్ అంటారు. కానీ ఇది మాత్రం పట్టాలపై తేలియాడుతూ వెళ్తుంది. అసలు చక్రాలే లేని ఈ ట్రైన్ ఇప్పుడు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.


ఈ అద్భుతమైన టెక్నాలజీని చైనాలోని సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ రైలు మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనికి ఎటువంటి చక్రాలు ఉండవు. కేవలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాయంతో ట్రాక్ కు కొన్ని అంగుళాల పైన గాల్లో తేలుతూ వెళ్తుంది. అంతేకాదు ఇది గంటకు 620 కిలోమిటర్ల వరకూ వేగాన్ని అందుకోగలదు. అయితే ఈ ట్రైన్ మనుషులు ఎక్కి ప్రయాణించేందుకు ఇంకా రెడీ కాలేదు. రైలు డిజైన్‌లో లోటుపాట్లను, పని తీరును పరీక్షంచేందుకు ఈ ట్రైన్‌ను ప్రోటోకాల్‌గా ఉపయోగిస్తారు.

ఇలా గాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌తో ప్రయాణించే ట్రైన్స్‌ను మాగ్లెవ్ ట్రైన్స్ అంటారు. జాపాన్‌లో ఎప్పటి నుంచో ఇవి ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా.. జపాన్ మాగ్లైవ్ ట్రైన్స్ కంటే వేగంగా, కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ ట్రైన్‌ను రూపొందించాయి. ఇవి జనానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఐదేళ్ల నుంచి పదేళ్ల సమయం పడుతుంది. చైనాలోని అన్ని నగరాలను వేగవంతమైన ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ మ్యాగ్లెవ్ ట్రైన్స్‌ను డెవలప్ చేస్తుంది.

- Advertisement -

Latest news

Related news