23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ 2017లో రూ.2019 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 4500 కోట్లకు పెరిగింది. 2022 నాటికి రూ.5560 కోట్లకు చేరుతుందని ఫిక్కీ అంచనా వేసింది. 2019తో పోలిస్తే 2020లో ఓటీటీ చూసేవారు 35 శాతం పెరిగారు. వీరిలో 60శాతం మంది 18 – 35 ఏండ్లలోపు వారే ఉన్నారని ఫిక్కీ లెక్కతేల్చింది. ఓటీటీలలో 40 శాతం మంది రీజనల్ లాంగ్వేజీ ప్రోగ్రామ్ లు వీక్షిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news