29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

భారీగా పెరగనున్న పెట్రోల్, డీజీల్ రేట్లు

పెట్రో ఉత్పత్తులపై కేంద్రం తాజాగా అగ్రి సెస్ ని విధించింది. దాంతో పెట్రోల్, డీజీల్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ పై రూ.2.5, డీజీల్ పై రూ.4 మేర అగ్రి సెస్ వేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి. పెట్రోల్ రేటు రూ.90కి దరిదాపుల్లో ఉండగా.. డీజీల్ ధర రూ.88 దగ్గరలో ఉంది. ఇక అగ్రి సెస్ విధింపు పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆకాశన్నంటడం ఖాయం. పెట్రోల్ రేటు రూ.100 అయ్యేందుకు చాలా రోజులు పట్టకపోవచ్చు.

- Advertisement -

Latest news

Related news