29.3 C
Hyderabad
Monday, March 1, 2021

అగ్రి సెస్ తో మోగనున్న ధరల మోతలు

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ డెవలప్‌మెంట్‌ సెస్‌(అగ్రి సెస్) అన్ని రంగాలను భారీగా ప్రభావితం చేయనుంది. క్రూడ్‌ ఆయిల్‌, ముడి ఆయిల్‌, ఆల్కహాల్‌తోపాటు కొన్ని దిగుమతి చేసుకొనే వస్తువులపై ఈ అగ్రి సెస్‌ విధించనున్నారు. దీంతో ఆల్కాహాల్‌, పెట్రోల్‌,‌ డీజిల్‌, పామయిల్‌, వంట నూనెల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బెవరేజెస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీంతో రానున్న రోజుల్లో మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్ పై 35 శాతం, ముడి సోయాబీన్‌, పొద్దు తిరుగుడు నూనెలపై 20 శాతం కొత్త సెస్‌ను విధించారు. అగ్రి సెస్ ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు అదనంగా జమ కానున్నాయి. అగ్రిసెస్ ద్వారా వసూలయ్యే మొత్తంతో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పార్లమెంట్ లో ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news