కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. దేశ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం క్యాపిటలిస్ట్ మిత్రులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ తర్వాత కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. డిమోనిటైజేషన్ ప్లాన్‌తో జాతి ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారంటూ ఆరోపించారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధించేందుకు పది పాలసీలను కేంద్రానికి సూచించిందని రాహుల్ గుర్తు చేశారు. అయితే ఈ బడ్జెట్లో కాంగ్రెస్ సూచించిన వేటిని కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.