32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

‘భారతరత్న’పై స్పందించిన రతన్‌ టాటా

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు #BharatRatnaForRatanTata హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. భారతరత్నకు రతన్‌టాటా అర్హుడేనటూ నెటిజన్లు రీ ట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు. డాక్టర్‌ వివేక్‌ భింద్రా అనే ఓ మోటివేషనల్‌ స్పీకర్‌ శుక్రవారం మొదలు పెట్టిన ప్రచారం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా స్పందించారు. ప్లీజ్ ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని ట్వీటర్ లో రతన్ రాసుకొచ్చాడు.

పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన కృషికిగానూ  కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌(2000), పద్మవిభూషణ్‌(2008) పురస్కరాలతో సత్కరించింది. దేశంలో కరోనా విజృంభించిన సమయంలో రూ. 1500కోట్ల విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news