ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ వీలర్ సెగ్మెంట్లో హోండా యాక్టివా సరికొత్త రికార్డు సృష్టించింది. యాక్టివా సేల్స్ 2.5 కోట్ల మార్క్‌ను అధిగమించాయని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 2001లో తొలిసారి ఇండియాలో యాక్టివా బ్రాండ్ ను ఆవిష్కరించారు. మార్కెట్లోకి అడుగుపెట్టిన మూడేండ్లలోనే స్కూటర్ సెగ్మెంట్లో యాక్టివా మార్కెట్ లీడర్‌గా అవతరించింది. ఇటీవల బీఎస్6 వెర్షన్ తో తీసుకొచ్చిన యాక్టివాను లాంచ్ చేయగా వీటికి కూడా వినియోగదారులను నుంచి విశేషాదరణ లభించిందన్నారు.