బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయన్నారు. వినియోగంలో ఉన్న రెండు వ్యాక్సిన్లను మరో 100 దేశాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు. 2021-22 బడ్జెట్ లో రూ.2.23 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది 137 శాతం అధికం.