29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తగ్గిన జోరు

గురువారం స్టాక్‌ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగింది. వరుసగా ఐదో రోజు సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 535.57 పాయింట్లు తగ్గి 46,874.36 పాయింట్లకు జారుకోగా, నిఫ్టీ 149.95 పాయింట్లు దిగి 13,817.55 వద్ద నిలిచింది. మరోవైపు గడిచిన ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 2,917.76 పాయింట్లు, నిఫ్టీ 827.15 పాయింట్ల చొప్పున పతనం చెందాయి. హెచ్‌యూఎల్‌ షేర్ వాల్యూ 3.65 శాతం తగ్గి టాప్‌ లూజర్‌గా నిలిచింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి 73.05 వద్ద స్థిరపడింది. ఈ భారీ నష్టాల వల్ల గత ఐదు రోజుల్లో 9 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది.

- Advertisement -

Latest news

Related news