ఈ కొత్త సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ కొత్త రికార్డుని సృష్టించింది. లాభాల జోరులో పెట్టుబడులను బూస్ట్ చేసేలా భారీ అంచనాలను పెంచేసింది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ.. సెన్సెక్స్ గురువారం తొలిసారిగా 50వేల మార్కును దాటింది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ సంకేతాలు ఉండడంతో.. పెట్టుబడులకు ప్రాధాన్యం పెరిగి సూచీ ఒక్కసారిగా పెరిగింది. బైడెన్ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్న నమ్మకంతో సెన్సెక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లకు పైగా ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 50,184.01 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చిన జోష్ అంతర్జాతీయ మార్కెట్లను పరుగులు పెట్టించింది. చరిత్రలో తొలిసారి హయ్యస్ట్ కు రీచ్ అయిన గురువారం సూచీ.. చివర్లో కాస్త లాభాలతో వెనక్కి వచ్చేసి కాస్త నిరాశపరిచింది.
మన దేశంలో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి సంస్థల షేర్లు బాగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ తో పాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా 85 పాయింట్లకు పైగా పెరిగి 14,753.55 పాయింట్లను చేరుకుంది. అంతకు ముందు కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ ప్రకటించడంతో గతేడాది మార్చి 23న సెన్సెక్స్ మునుపెన్నడూ లేనివిధంగా 3,934.72 పాయింట్లు నష్టపోయింది.
ఇప్పటివరకు సెన్సెక్స్‌ను బాగా ప్రభావితం చేసిన టాప్-10 అంశాలివే..
కరోనా వైరస్, జీఎస్టీ , పెద్ద నోట్ల రద్దు, కేంద్రంలో ఎన్డీయే, యూపీఏ జయాపజయాలు, పీఎన్బీ, కామన్వెల్త్, 2జీ, సత్యం, హర్షద్ మెహతా కుంభకోణాలు, బడ్జెట్లు, సంస్కరణలు, ముంబై పేలుళ్లు, రాజీవ్ గాంధీ హత్య, పార్లమెంట్‌పై ఉగ్రదాడి, కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మహా పతనం.