ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మౌలిక రంగానికి భారీ వ్యయం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సంస్కరణలపై దూకుడు నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ దూసుకుపోతుంది. గృహాలపై పన్ను విరామం, స్టార్టప్, కొత్త కంపెనీల స్థాపనకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు మార్కెట్ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 842 పాయింట్ల లాభంతో 47,128 పాయింట్ల వద్ద ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 13,829 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది.