29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఎగిరే కార్ల కోసం అర్బన్ ఎయిర్‌పోర్టు.. ఎక్కడో తెలుసా?

ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించేందుకు ఎగిరే కార్లపై పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో వీటిపై ప్రయోగాత్మకంగా జరుపుతున్న పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే పలు సంస్థ ఎగిరే కార్ల తయారీలో బిజీగా ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చాక.. ఇవి దిగేందుకు ప్లేస్ కావాలి కదా. ఈ విషయంలో యూకే ఓ అడుగు ముందుకేసి ఎగిరే కార్ల కోసం కోవెంట్రీ‌లోని యూకే సీటీ ఆఫ్ కల్చర్‌లో అర్బన్ ఎయిర్ పోర్టులను నిర్మించే ఆలోచన చేస్తోంది. పైగా దాన్ని ఈ ఏడాదే అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం 1.2 మిలియన్ పౌండ్లు (రూ.87,488,700) యూకే ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను హ్యుందాయ్ సంస్థకు అప్పగించారు.

ఈ ఎగిరే కార్లను టెక్నికల్ పరిభాషలో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ (eVTOLs) వాహనాలని పిలుస్తారు. ఇవి హెలికాప్టర్లు లేదా డ్రోన్ల తరహాలో ఉన్నచోట నుండే గాల్లోకి లేస్తాయి. ‘కార్లకు రోడ్లు.. రైళ్లకు పట్లాలు.. విమానాలకు ఎయిర్‌పోర్టులు..  అలాగే ఎగిరే కార్లకు అర్బన్ ఎయిర్ పోర్టులు అవసరం అవుతాయి. భూమిపై మాత్రమే కాకుండా నీటిలోనూ తేలియాడే డాక్స్ ఏర్పాటు చేస్తాం.  ఇందులోనే ఎగిరే కార్లకు ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తాం.’ అని  అర్బన్ ఎయిర్ పోర్ట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ రిసాంధు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news