21.7 C
Hyderabad
Friday, January 22, 2021

కొత్త పాలసీపై వాట్సాప్ వివరణ

వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీతో ఖాతాదారుల్లో నెలకొన్న ఆందోళనలపై వాట్సాప్‌ మేనేజ్మెంట్ స్పందించింది. వాట్సాప్ గ్రూపుల్లోని వ్యక్తిగత సందేశాలు, సమాచారం గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌లో లీక్‌ అవుతున్నాయన్న ఆరోపణలను కొట్టిపారేసింది. కొత్త టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీతో ఖాతాదారులు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లతో పంచుకునే సమాచారంపై ఎటువంటి ప్రభావం ఉండదని మరోసారి స్పష్టం చేసింది. వాట్సాప్‌ యూజర్ల డేటాను ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో ఎలా పంచుకునేదీ వివరించింది. కేవలం వాట్సాప్‌ బిజినెస్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగిస్తామని పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...