వాట్సాప్ డెస్క్ టాప్ ను మీ ఫోన్ తో ఎవరైనా కనెక్ట్ చేయడం ఇక మీదట కుదరదు. వాట్సాప్ డెస్క్ టాప్ వాడుతున్న వారికి ఓ కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం డెస్క్ టాప్ పై వాట్సాప్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేందుకు ముందుగా మీ ఫోన్ ని ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ తో మీఫోన్ ఎప్పుడు వాట్సాప్ డెస్క్ టాప్ కు కనెక్ట్ అయినా యూజర్ మొబైల్కు నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాటు చేశారు.