జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 150 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని.. ఫిల్మ్ నగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- కొద్దిసేపటి క్రితం నటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతో కలిసి ఫిలింక్లబ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వారితో పాటు.. ప్రముఖ నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఉషా ముళ్లపూడి, దర్శకుడు క్రిష్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఆలీ, సినీ రచయిన పరుచూరి గోపాలకృష్ణ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- కుందన్‌బాగ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహన్, డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- అజంపురాలో హోమంత్రి మహమూద్ అలీ, సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు వేశారు.
- కుషాయిగూడలో మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, జూబ్లీహిల్స్‌లోని ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీమణి అమలతో కలిసి.. నాగార్జున ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- నాంపల్లిలోని వ్యాయమశాఖ పోలింగ్ కేంద్రంలో సీపీ సజ్జనార్ తదితరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ
- బంజారాహిల్స్ బీఎస్ డీఏవీ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ కవిత