18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

కేజీఎఫ్ ఛాప్టర్ 2..సంజ‌య్ ద‌త్ లుక్ అదుర్స్

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌ చాప్టర్‌1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టికీ అభిమానుల్లో భారీ అంచ‌నానే ఉన్నాయి. క‌న్న‌డ న‌టుడు య‌శ్ మ‌రోసారి ఈ చిత్రంతో పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ అవుతాన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. 

నేడు సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్రంలోని ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. అధీరా పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. సంజ‌య్ ద‌త్ నెరిసిన గ‌డ్డంతో హాలీవుడ్ స్టైల్ హెయిర్ క‌ట్ తో క‌ళ్లు మూసుకున్న‌ట్టుగా ఉన్న స్టిల్ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ను పెంచేస్తుంది. మరి చాప్టర్‌-2లో అధీర పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో చూడాలి

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...